క్యాన్సర్, పక్షవాతం.. కలిసి కబళిస్తున్నాయ్!


అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనంలో భాగంగా 75 లక్షలమంది క్యాన్సర్ రోగుల డేటాను సేకరించి విశ్లేషించారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, దాన్నుంచి బయటపడ్డవారు పక్షవాతంతో మృత్యువాతపడే ముప్పు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.