రిలయన్స్ వెనక్కి


 రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న 2 ఒప్పందాల్లో ఒకదాని నుంచి వైదొలగనున్నట్లు సమాచారం. తిరుపతి సమీపంలో ఏకంగా రూ.15వేల కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ (మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్) ఆలోచనను విరమించుకున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు.