హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ట్ ఏర్పాటుచేసిన 13వ పౌల్ ఇండియా ఎక్స్పను బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పౌల్ట్రీ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఎక్స్పోలో దాదాపు 350 కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. పౌల్ట్రీ ఫామ్ నిర్వహణకు అవసరమైన ప్రతి వస్తువు అందుబాటులో ఉండేలా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి.