అదరగొట్టిన అమ్మాయిలు


 ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆదివారం పోటీల చివరిరోజు ఐదు స్వర్ణాలు గెలుచుకున్నారు. మహిళల విభాగం ఫైనల్లో నారెమ్ చాను (5/ కేజీలు), వింక (64 కేజీలు), సనమచా చాను (75 కేజీలు), పూనమ్ (54 కేజీలు), సుష్మ (8/ కేజీలు) పసిడి పతకాలు గెలవగా.. పురుషుల్లో సెలయ్ సోయ్ (49 కేజీలు), అంకిత్ నర్వాల్ (60 కేజీలు) తుది సమరంలో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు.