రాష్ట్రంలో పట్టుచీరలు నేస్తున్న నేతన్నలకు ప్రభుత్వం రాయితీ బకాయిలు అందించనుంది. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి కిలో పట్టు కొనుగోలుకు రూ.250 చొప్పున నాలుగు కిలోలకు నెలకు రూ.1000 సాయం ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాం నుంచి ఈ పథకం అమలవుతుండగా బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రాయితీ సాయాన్ని అందిస్తున్నారు. నవంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లించనున్నట్లు పట్టు పరిశ్రమశాఖ అధికారులు తెలిపారు.
చేనేతలకు పట్టు రాయితీ