లోకేశ్ పై వంశీ తీవ్ర వ్యాఖ్యలు


TDP నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై MLA వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తనను తిట్టే కనీస అర్హత లేదని విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని బతికే లోకేశ్ తో తనకు పోలికేంటన్నారు. తాను సొంతంగా గెలిచానని.. లోకేశ్ ఎక్కడ గెలిచారన్నారు. చంద్రబాబు తనను సస్పెండ్ చేయడం ఏమిటని, దమ్ముంటే రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి చూపించాలన్నారు. తనపై ఆరోపణలు చేస్తే వారి బండారం బయటపెడతానని వంశీ హెచ్చరించారు.