దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన ఇక సులభం కానుంది. ప్రత్యేకంగా పర్యాటక యాత్రలకు ఉద్దేశించిన 'భారత్ దర్శన్ రైలు' తెలుగు రాష్ట్రాల సొంతం అవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) ఈ రైలులో యాత్రలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ముందుగా దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుడుతోంది. జనవరి 3నుంచి ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.
తెలుగు రాష్ట్రాలకు భారత్ దర్శన్ రైలు