ఓవైపు మహారాష్ట్రలో పార్టీల వరుస సమావేశాలతో రాజకీయం వేడెక్కితే మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం రాజస్థాన్ లో చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తూ గడుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పార్టీ తమ 40మంది ఎమ్మెల్యేల్ని శుక్రవారం రాజస్థాన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు జోధ్ పూర్ లోని పలు పర్యాటక ప్రదేశాలు, పుష్కర్ ఉత్సవం, ప్రముఖ అజ్మేర్ దర్గాను సందర్శించారు. అలా ఆదివారానికి జైపూర్ చేరుకున్నారు. ఈ రోజు అక్కడి ప్రముఖ ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఓవైపు ఉత్కంఠ..మరోవైపు ఎమ్మెల్యేల టూర్