కర్తాపూర్ సిద్ధం.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ట్వీట్


 ఇస్లామాబాద్: మరో కొద్ది రోజుల్లో కర్తార పూర్ కారిడార్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే సిక్కు యాత్రికులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేసినట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో కర్తార పూర్ కాంప్లెక్స్, గురుద్వారా సాహిబ్ సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. "సిక్కు యాత్రికులకు స్వాగతం పలికేందుకు కర్తాపూర్ సిద్ధం" అని ట్వీట్ చేశారు.