ఉత్తర భారతంపై కాలుష్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చారిత్రక కట్టడం తాజ్ మహల్ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజ్ మహల్ వద్దకు ఎయిర్ ఫ్యూరిఫైయర్ వాహనాన్ని పంపింది. 300 మీటర్ల పరిధిలో 8 గంటల్లో 75 లక్షల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేసే సామర్థ్యం ఈ వాహనానికి ఉంది.
తాజ్ సంరక్షణకు ప్రభుత్వం చర్యలు