నేడు థాక్రే ప్రభుత్వానికి బలపరీక్ష


మహారాష్ట్ర CM ఉద్దవ్ థాక్రే నేడు శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. థాకరే నేతృత్వంలోని శివసేన-NCP-కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వం శాసనసభలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్నది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఆయన నిర్వహిస్తారు.