వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో లక్నో నగర మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్నో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు దహనంపై నిషేధం విధిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. బొగ్గు దహనంతో వంటలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఇకపై బొగ్గును దహనం చేయవద్దని ఆదేశించారు.