కశ్మీర్పై వెనక్కి తగ్గిన బ్రిటన్ ప్రతిపక్షం


 కశ్మీర్ అంశంపై భారత వైఖరికి భిన్నంగా వ్యవహరించిన బ్రిటన్లోని ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. అక్కడి భారతీయ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని మార్చుకుంది. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. ఇతర దేశాల వ్యవహారాల్లో ఇకపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ఛైర్మన్ ఇయాన్ లావెరీ ఓ ప్రకటన విడుదల చేశారు.