ఆసుపత్రిలో చేరనున్న కమల్ హాసన్ రేపు శస్త్రచికిత్స


ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్, ఓ శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరనున్నారు. పార్టీ తరఫున మీడియాకు విడుదలైన ప్రకటనలోని వివరాల మేరకు, కమల్ కు శుక్రవారం నాడు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 2016లో ఆయన ఓ ప్రమాదానికి గురికాగా, కాలులో ఇంప్లాంట్ ను డాక్టర్లు అమర్చారు. ఇప్పుడు దాన్ని తీసేసే సమయం ఆసన్నమైందని పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ వెల్లడించారు.