బ్రెజిల్ లో జరగనున్న 11వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు జిల్ బయలుదేరారు. రెండు రోజులు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఉజ్వల భవిష్యత్తు' అనే అంశంపై ప్రముఖంగా చర్చించనున్నారు. ఈ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిపింట్లతో ప్రధాని వేరువేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా బ్రిక్స్ బిజినెస్ ఫోరం ముగింపు సమావేశంలో కూడా మోదీ పాల్గొననున్నారు.