వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సోమవారం కిసాన్ మేళా నిర్వహించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ సంస్థ డ్రోన్ సహాయంతో కంది పంటలో పురుగుల మందు పిచికారీ చేసే తీరును ప్రదర్శించింది. దీనిని రైతులు ఆసక్తిగా తిలకించారు.
వరంగల్ లో డ్రోన్ తో పురుగుమందు పిచికారీ