అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పు ఏ ఒక్కరికీ విజయంగానీ.. ఓటమిగానీ కాదని పునరుద్ఘాటించారు. "అయోధ్యపై తీర్పుని ఏ ఒక్కరికీ విజయంగాగానీ, ఓటమిగాగానీ భావించరాదు. రామభక్తి అయినా.. రహీమ్ భక్తి అయినా ఇకపై భారతభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది" అని మోదీ అన్నారు.
దేశభక్తిని బలోపేతం చేద్దాం: మోదీ