పింపుల్స్, డార్క్ స్పాట్స్ కి చెక్ పెట్టండి...


 ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, సమానంగా రోజ్ వాటర్, వేప పొడి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం నిగారిస్తుంది. చర్మంపై అసహ్యంగా కనిపించే డార్క్ ప్యాచెస్ నివారించడానికి | టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, పుదీనా ఆకులు, పెరుగు తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఆ ప్యాక్ ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.