డయాబెటిస్ ఉన్నవారు కోకనట్ వాటరు త్రాగవచ్చా..?


ప్రకృతి మనకు అందించే స్వచ్ఛమైన పదార్ధాలలో ఒకటి కోకనట్ వాటర్. అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ కోకనట్ వాటర్ సహజంగా తీయ్యగా ఉంటాయి. బరువు తగ్గడానికి మరియు ఎనర్జిటిక్ గా ఉండటం కోసం ముఖ్యంగా కొబ్బరి నీరు త్రాగుతారు. ఈ నీరు తీపి రుచి కలిగి ఉన్నప్పటీకీ వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి మరియు కేలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గడానికి కోకనట్ వాటర్ ను సిఫార్సు చేయబడింది. డయాబెటిస్ ఉన్నవారు కోకనట్ వాటరు త్రాగవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వీటి వల్ల ప్రయోజనాలున్నాయా? లేవా? అనేది చర్చనీయాంశం. కోకనట్ వాటర్ తీపి రుచి కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చాలా మంది వీటిని త్రాగడానికి భయపడుతుంటారు, అయితే కేలరీలను తగ్గించడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొందరి వాదన.
డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 2015 లో డయాబెటిస్ పై జరిపిన అధ్యయనంలో డయాబెటిస్ ఉన్న యువకులకు డైట్ పరీక్షను విజయవంతంగా ఆమోదించింది. చక్కెర ఉన్నవారికే కాకుండా ఇతరులు కూడా ప్రతిరోజూ కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చు. అయితే మీరు ఎంత మోతాదులో తీసుకుంటున్నారన్న విషయంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్ళలో ఉండే ఫ్రక్టోజ్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కొబ్బరి నీటిలో తక్కువ ఫ్రక్టోజ్ (సుమారు 15%) ఉంటుంది, మరియు ఫ్రక్టోజ్ మీ రక్తంలో చక్కెర స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.