ఆసియా ఛాంపియన్షిప్లో భారత షూటర్ దీపక్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించి టోక్యో ఒలింపిక్కు అర్హత సాధించాడు. ఖతార్ లో జరుగుతున్న 14వ ఆసియా ఛాంపియన్‌షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్ ఈవెంట్ లో 227.8 స్కోరుతో పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపికకు అర్హత సాధించిన పదో భారత షూటర్‌గా దీపక్ నిలిచాడు.
టోక్యో ఒలింపిక కు భారత షూటర్ దీపక్ దోహ