అసమర్ధ CM గా జగన్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గురువారం విజయవాడలో చంద్రబాబు చేప్టటిన ఇసుక దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పార్టీలు మారుతున్నవారు తర్వాత లెంపలేసుకుంటారన్నారు. 6 నెలలకే జగన్ ఇసుకాసురుడిలా తయారయ్యారని, ఏపీ ప్రజలను గంగలో ముంచే స్థితికి తీసుకొచ్చారన్నారు. బొత్సను మంత్రిగా అనుకుంటే సిగ్గుచేటన్నారు. ఈ దద్దమ్మ ప్రభుత్వానికి రాజధాని అభివృద్ధి కనిపించడంలేదా? అని ఆయన ప్రశ్నించారు.