మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పాతబస్తీతో పాటు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు కొనసాగనుండడంతో చాదర్‌ఘాట్ వద్ద ఆర్టీసి బ్సులను మళ్లిస్తారని, ఎస్పీ రోటరీ, మిరాలం మండి రోడ్డు ర్యాలీ ముగిసే వరకు బస్సులకు అనుమతి ఉండదని వెల్లడించారు.