దేశీయ పరిజ్ఞానంతో కొత్తగా డిజైన్ చేసిన సంపీడిత భారజల రియాక్టర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు భారత అణు ఇంధన కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్.కె.శర్మ తెలిపారు. మొత్తం 10 యూనిట్లు నిర్మిస్తామన్నారు. మొదటి కర్మాగార నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమెరికాలోని వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో అణు రియాక్టర్లను నిర్మించే విషయమై వాణిజ్య, సాంకేతిక అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.