ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తున్న ఫ్లిప్ కార్ట్


 ఈ రోజుల్లో ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ నే వినియోగిస్తున్నారు. ఇదంతా చెత్తలో కలిసి పర్యావరణానికి హాని కలగచేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ FLIP-KART ఓ కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఢిల్లీ, ముంబై, పూనా,నగరాల్లో ఇటీవలే ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వస్తువులు డెలివరీ అయ్యాక..ప్యాకేజీంగకు ఉపయోగించిన కవర్లను డెలివరీ బాయ్ కు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తామని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.