మళ్లీ కోర్టులో పరిణీతి...


ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. మళ్లీ బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెడుతున్నా' అంటోంది పరిణీతి చోప్రా. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ లో పరిణీతి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సెట్స్పకి వెళ్లింది. అయితే కొద్దిరోజుల క్రితం చిత్రీకరణలో పరిణీతికి గాయమైంది. మెడ నొప్పితో బాధపడుతున్న ఆమెను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. దీంతో చిత్రీకరణ ఆగింది. పదిరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ పరిణీతి రంగంలోకి దిగుతోంది.