ప్రియాంక హంతకులకు బహిరంగ శిక్షలు విధించాలి


 ప్రియాంక హంతకులకు బహిరంగ శిక్షలు విధించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శంషాబాద్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యా ఉదంతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ హత్యాచారం ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూగజీవాలకు వైద్యం చేసే ప్రయాంకను మానవ మృగాలు అత్యాచారం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, అయన బహిరంగ లేఖను విడుదల చేశారు.