ఎయిర్ పోర్ట్ లో చిరుత సంచారం


రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.. విమానాశ్రయ పరిసర ప్రాంతాలో చిరుత సంచరించడాన్ని స్థానిక ప్రజలతో పాటు పలువురు ప్రయాణీకులు కూడా చూశారు.. దీనిపై ప్రయాణీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు..చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణీకులకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.