గుట్టుచప్పుడు కాకుండా రామచిలక లను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులు కలిసి రామచిలుకలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 500 రామచిలుకలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో రామచిలుకలను 200 నుంచి 500 రూపాయిల వరకూ అమ్ముతున్నారని డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ టిఎన్ సింగ్ చెప్పారు.