స్పెక్ట్రమ్ చెల్లింపులపై టెలికాం సంస్థలకు రెండేళ్ల గడువు


టెలికాం సంస్థలకు కేంద్రం ఉపశమనం కల్పించింది. స్పెక్ట్రమ్ చెల్లింపులపై రెండేళ్ల గడువు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020-21, 2021-22 చెల్లింపులను వాయిదా వేయడం వల్ల భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలకు రూ.42,000 కోట్ల వరకు ఉపశమనం లభించనుంది. కేబినెట్ నిర్ణయంపై టెలికాం ఆపరేటర్ల సంఘం కాయ్ హర్షం వ్యక్తం చేసింది.