పిల్లలే మన భవిష్యత్ : కల్వకుంట్ల కవిత


 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావించి.. వారిని ఆదరించే సమాజాన్ని సృష్టిద్దాం. పిల్లలే మన వర్తమానం.. పిల్లలే మన భవిష్యత్ అని ఆమె పేర్కొన్నారు. పిల్లలు అభివృద్ధి చెందే సమాజాన్ని సృష్టిద్దామని కవిత పిలుపునిచ్చారు.