కరువు, వరదలు తోనే పెరిగిన ఉల్లి ధర


 ఉల్లి ధరలు ప్రజలను ఉలికి పాటుకు గురిచేస్తున్నాయి. రెండు నెలలుగా రూ.50 నుంచి రూ.70 దాకా అమ్మిన కిలో ఉల్లి రెండు రోజులుగా కొన్ని చోట్ల రూ.100కు చేరింది. ఇందుకు ప్రకృతి వైపరీత్యాలే కారణమని కేంద్ర ప్రభుత్వం విశ్లేషించింది. కేంద్ర ఆహార, ప్రజాపం పిణీ వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాస్వాన్ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశీయంగా ఉల్లి ఉత్పత్తి 30-40 శాతం మేర తగ్గడంతో ధరలు బాగా పెరిగాయని చెప్పారు.