ఆర్కిటిక్ ప్రాంతంలో వేగంగా కరుగుతున్న మంచుతో మానవాళికి ముప్పు తప్పదన్నది శాస్త్రవేత్తలు చాన్నాళ్లుగా హెచ్చరిస్తున్న విషయమే! ఆ ముప్పు ప్రభావం ఇంతకుముందు ఊహించినదానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు కెనడాలోని మెక్ గిల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. ఆర్కిటిక్ ఉపరితలం దిగువన ఏళ్లుగా గడ్డకట్టిన మృత్తిక (పర్మాఫ్రాస్ట్) వేగంగా కరిగిపోతుంటే పర్యావరణంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా అధ్యయనంలో వారు గుర్తించారు.