భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ లాంగ్ మార్చ్ ను ప్రారంభించారు. ఈ ర్యాలీకి తెదేపా మద్దతు ప్రకటించింది.
విశాఖలో ప్రారంభమైన జనసేన లాంగమార్చ్