అంగారకుడిపై జీవం ఉందా? భూమి మీద ఉన్నట్లే అక్కడ అనేక రకాల జంతు జాతులున్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు అమెరికాలోని ఒహైయో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఎమెరిటస్ విలియమ్ రొమొసెర్. అంగారకుడిపై పలు కీటకాల అవశేషాలను తాను చిత్రాల్లో గుర్తించినట్లు తెలిపారు. భూమిపై కీటకాల తరహాలోనే అక్కడి కీటకాలకూ రెక్కల వంటి నిర్మాణాలున్నాయన్నారు. సరీసృపాల వంటి జీవుల అవశేషాలు కూడా చిత్రాల్లో బయటపడ్డాయని వెల్లడించారు.
అంగారకుడిపై కీటకాలు