యువ వికెట్ కీపర్ బ్యాట్సమన్ రిషభవంతు కుదురుకొనేందుకు తగినంత సమయం ఇవ్వాలని టీమిండియా ప్రపంచకప్లో హీరో యువరాజ్ సింగ్ అన్నాడు. అతడు తన ఆటతీరును మార్చుకుంటున్నాడని, యువకులకు అండగా నిలిచి వారిని మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దాలని సూచించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో 4, 5 స్థానాల్లో అతడు బాగున్నాడు. కానీ అతడు ఓపెనర్ అన్న సంగతి ఎంతమందికి తెలుసు. ఇప్పుడిప్పుడే తన ఆటను మార్చుకుంటున్నాడు. అతడికి సమయం ఇవ్వాలి' అని యువీ అన్నాడు.
ఆటతీరు మార్చుకుంటున్న పంత్: యువీ