సర్కారు ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ


 దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక సప్టర్ జంగ్ ఆసుపత్రి (SJH)లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిలో రోబోటిక్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి. క్యాన్సర్, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడే పేదలు ఉచితంగానే సప్టర్ జంగ్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ చేయించుకోవచ్చు.