మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో


 వరుస విజయాలతో దూసుకుపోతూ, అంతరిక్ష పరిశోధన రంగంలో భారత పతాక గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైనా.. నిరుత్సాహపడకుండా ఈ నెల 25న ఉదయం 9.28 గంటలకు PSLV-C47 రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. దీనిద్వారా కార్టోశాట్ ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.