చెరో రెండున్నరేళ్లు!


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు చేరువ అవుతున్నట్లుగా శివసేన, ఎన్సీపీ నేతలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా వాటి మధ్య అవగాహన కుదిరిందని, ఉపముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు తరవాత అమలు చేయాల్సిన కనీస ఉమ్మడి ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.