తలనొప్పి రావడానికి, హ్యాండ్‌బ్యాగ్‌కి సంబంధం ఏంటి అని అంటున్నారా.. సంబంధం ఉందండి .. హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా వాడడం వల్ల తలనొప్పి వస్తుందట.. ఇదే విషయం తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
తలనొప్పి వచ్చిందంటే చాలు ఏం పని చేయలేం.. తెగ ఇబ్బంది పడుతుంటాం. సమస్య తగ్గించుకునేవరకూ ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. ట్యాబ్లెట్స్, బామ్ ఇలా ప్రతీ ఒక్కటి వాడుతుంటాం. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే తాజాగా మరో కొత్త విషయం తెలిసింది. అదేంటంటే.. హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా వాడడం వల్ల తలనొప్పి వస్తుందని పరిశోధకులు తెలిపారు. అవును.. ఎందుకంటే.. మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో పది శాతానికి మించి ఎక్కువగా ఉంటే ఆ బరువు ఒత్తిడిగా మారుతుంది. ఇలా ప్రెజర్ ఎక్కువ అయితే.. ముందు భుజాలు నొప్పిగా ఉంటాయి. ఆ తర్వాత మెడనొప్పి, తలనొప్పికి దారి తీస్తుందట. అందుకే ఎక్కువగా బరువు ఉండే హ్యాండ్ బ్యాగ్‌లు వాడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. అంత అవసరం ఉంటే బ్యాగ్ తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అదే విధంగా.. ఒకే సైడ్‌కి వేసుకోకుండా.. మధ్యమధ్యలో మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. ఒకే వైపు ఒత్తిడి పడదు.
హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే తలనొప్పి వస్తుంది..