ఉద్యోగ సమయంలో నిద్రపోతే యాజమాన్యాలు తీవ్రంగా పరిగణిస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం నిద్రపోవడమే ఉద్యోగం. ప్రతి రాత్రి 9 గంటల పాటు చక్కగా పరుపుపై విశ్రమించాల్సి ఉంటుంది. ఇలా 100 రోజులు చేస్తే రూ.లక్ష ఇస్తారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఫోమ్ పరుపుల తయారీ సంస్థ 'వేక్ ఫిట్' ఒక ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలోని అత్యంత బాగా నిద్రపోయే వారిని తాము రిక్రూట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
'లక్ష'ణంగా నిద్రపోయే ఉద్యోగం