కానుక గా .. అరకు కాఫీ మొక్క

 


 


మన తెలుగు గడ్డ మీదున్న అరకులో పండే కాఫీ మొక్కల నుంచి తయారయ్యే కాఫీ ఘుమఘుమలకు ఫిదా అవ్వని వారుండరు. అలాంటి ఓ అరకు కాఫీ మొక్కను ఓ మహిళ నుంచి బహుమతిగా అందుకున్నారు ప్రముఖ కథానాయకుడు షారుఖ్ ఖాన్. స్పూర్తిదాయక విజయగాథలను వివరించే టెడ్ టాక్స్ కార్యక్రమానికి షారుఖ్ అతిథిగా వచ్చారు. అరకు నుంచి వచ్చిన ఓ మహిళా రైతు అందులో వక్తగా పాల్గొంది. ఆ సందర్భంగా షారుఖకు ఆమె అభిమానంతో కాఫీ మొక్కను కానుకగా అందించింది. ఆ మొక్కను ఇలా మనసారా హత్తుకుని మురిసిపోయారు షారుఖ్.