ట్రిపుల్ ఐటీలకు జ్వరమొచ్చింది!


 కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు జ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు. వందలాది మంది అస్వస్థతకు గురికాగా, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గి 20 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి రోజూ 300 మంది జ్వరంతో చికిత్సకు వస్తున్నారు. 2 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 9 వేల మంది చదువుతున్నారు. ఆసుపత్రిలో దాదాపు అన్ని గదుల్లో జ్వరపీడిత విద్యార్థులే కనిపిస్తున్నారు. వీరిలో పలువురికి టైఫాయిడ్, మలేరియా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.