టార్గెట్లు పెట్టుకుని మరీ YCP నేతలు ఇసుకను దోచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే రేపు దీక్ష చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇసుక కృత్రిమ కొరతను వైకాపా నేతలే సృష్టించి.. మాఫియాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు చేయాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా 'జె ట్యాక్స్' కట్టాలని దుయ్యబట్టారు. కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలని.. వారి కుటుంబాలకు సంఘీభావం చూపాలని తెలిపారు.
ఇసుక మాఫియాగా ఏర్పడి దోచుకుంటున్నారు