ఇక మీరే UAN పొందొచ్చు


 యాజమాన్యంతో సంబంధం లేకుండా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను నేరుగా ఉద్యోగే పొందే సదుపాయాన్ని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కల్పించింది. ప్రస్తుతం UAN నంబర్ పొందాలంటే యాజమాన్యంపై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై EPFO వెబ్ సైట్ ద్వారా ఉద్యోగే నేరుగా పొందొచ్చు. ఉద్యోగి జీవితకాలం పాటు ఉండే ఈ నంబర్ ఉద్యోగం మారేటప్పుడు PF మొత్తం బదిలీకి ఉపయోగపడుతుంది.