తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విద్యాసంస్థల్లో ఇప్పటివరకు అమలవుతున్న మేనేజ్ మెంట్ కోటాను రద్దుచేశారు. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతుంది. ఈ సంస్థల్లో TTD సిబ్బంది పిల్లలకు కొంత కోటా ఉంది. దీంతోపాటు మేనేజ్మెంట్ కోటా ఇవ్వాలని ఉత్తర్వులు లేకపోయినా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని సెప్టెంబరులోనే జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు.
TTD విద్యాసంస్థల్లో మేనేజ్మెంట్ కోటా రద్దు