నాణ్యత గల హెల్మెట్లనే ధరించాలి


 వాహన దారులు తప్పని సరిగా నాణ్యత గల హెల్మెట్లనే ధరించాలని సైబరాబాద్ కమిషనర్ 'సజ్జనార్' తెలిపారు. నాసిరకం హెల్మెట్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు. ఇకనుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెద్దయెత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నాసిరకం హెల్మెట్లను తయారుచేసే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.