ఇటీవల అందుబాటులోకి వచ్చిన బయో డైవర్సిటీ వంతెనపై రాత్రి వేళ రాకపోకలు నిలిపివేయాలని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. శనివారం రాత్రి వంతెనపై ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఫ్లై ఓవర్‌ను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రాత్రి // గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వంతెన మూసి వేయాలని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు GHMC అధికారొకరు తెలిపారు.
బయో డైవర్సిటీ వంతెన రాత్రి వేళ మూసివేతకు యోచన