కక్ష్యలోకి Space X 60 చిన్న ఉపగ్రహాలు


 అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ 'స్పేస్ X 60 చిన్న కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కవరేజీ కోసం ఉద్దేశించిన స్టార్ లింక్ నెట్ వర్క్ లలో ఇది రెండో ప్రయోగం. ఈ మేరకు 'స్పేస్ ఎక్స్'కు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా వీటిని రోదసిలోకి ప్రవేశ పెట్టారు. ప్రపంచంలోని ఏమూలకైనా అధిక వేగంతో ఇంటర్నెట్ అందించాలన్న సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆలోచన మేరకు వీటిని రూపొందించారు.