తెల్ల రేషన్ కార్డు... ఆధార్ 'అమ్మఒడి' పథకానికి తప్పని సరి


 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్‌ను తప్పనిసరిగా కలిగిఉండాలి. ఈ మేరకు విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ' ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికయ్యే తల్లులు రాష్ట్ర ప్రభు త్వ నిబంధనల ప్రకారం పేదరికపు రేఖకు దిగువన ఉండాలి. ఆ కుటుంబం కచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.