విద్యుత్ బస్సులపై అభ్యంతరాల స్వీకరణ: RTC


 RTC లో నడిపే 350 విద్యుత్ బస్సులకు సంబంధించిన టెండర్‌పై అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలపాలని RTC అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టెండరును న్యాయ సమీక్ష నిమిత్తం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్ రావుకు పంపించామన్నారు. న్యాయ సమీక్షలో భాగంగా ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాల స్వీకరణకు వీలుగా టెండరు డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్ష వెబ్సైట్ లోనూ ఉంచినట్లు తెలిపారు.